ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నర్సంపేట : ప్రభుత్వ కార్యాలయాల్లో 2005 సమాచార హక్కు చట్టం బోర్డులను నియమించాలని ఆయా ఆఫీసులలో సమాచార అధికారి పేరు వ్రాసి పెట్టాలని దుగ్గొండి సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షుడు గూడపు అమరేందర్ ఒక్క ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఏ అధికారిని సమాచారం అడగాలో తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఫోన్ నెంబర్లను రాసేలా చూడాలని కోరారు.కార్యాలయంలో అధికారుల టేబుల్ ముందు కూడా వారి వారి హోదా, పేరు బోర్డులను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అలా చేసినప్పుడే ప్రజలకు సమాచారం పూర్తిగా అందించడం జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News