Friday, 31 July 2026 06:39:21 PM

తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల...

Date : 06 December 2024 07:01 PM Views : 526

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నమూనాను నేడు విడుదల చేశారు. సాధారణ మహిళను పోలినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఇరవై అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌ వద్ద ఏర్పాటు చేయనున్నారు. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర, మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి.

తెలంగాణ తల్లి నూతన రూపం..

‘తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల అస్థిత్వం. తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజల మాతృమూర్తి. తెలంగాణ చరిత్ర, అరుదైన పోరాటాల చరిత్ర. దశాబ్దాల పోరు తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో వేలాది అమరుల త్యాగాలతో, సోనియా గాంధీ ఆశీర్వచనాలతో సాధించింది తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవాన విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సకల బహుజనులు సాదించిన విజయం.. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ బాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూరిని వ్యక్తపరుస్తుంది. పూర్వ తెలంగాణ తల్లి రాచరికపు హావభావాలు, వాస్తన ప్రజానికం సంస్కృతికి భిన్నంగా, ధనిక స్త్రీగా చిత్రీకరించడం జరిగింది. ఈ కారణంగా చాలామంది ప్రజల మన్ననలు పొందలేక పోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక దేవతామూర్తికి, మాతృమూర్తికి ఎంత వ్యత్యాసం ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ తల్లి. బోనాలు, బతుకమ్మ, సమక్క సారాలమ్మ, సదర్ పండుగలతో, విశిష్ట శిల్ప సంపదలతో, చేతివృత్తులు, చేనేత ప్రతిభలత విరజిమ్ము తన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నూతన తెలంగాణ తల్లి సాంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకుట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి తెలంగాణ తల్లి విగ్రహ పూపకల్పన చేసింది కూడా ఫ్రోఫెసర్ గంగాధర్. నాటి ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకే నాటి తెలంగాణ తల్లి రూపకల్పన జరిగిందని ఆయన అన్నారు. ప్రొ. గంగాధర్ రూపొందించిన నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కాంస్య విగ్రహంగా చేసింది ఎం.వి.రమణారెడ్డి. రమణారెడ్డి ప్రముఖ శిల్పి. 1966లో జన్మించిన ఎంవీ రమణారెడ్డి ఎన్నో దేశాలను తిరిగి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పొషిస్తూ తన కళద్వారా అందరి మన్ననలు పొందారు. తెలంగాణ అమరజ్యోతి, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న శ్రీ రాజీవ్ గాంధి గారి విగ్రహం రమణారెడ్డి రూపొందించిన శిల్పాలు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :