Friday, 31 July 2026 02:39:40 PM

అర్హత కలిగిన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి.

రామగుండం తహసిల్దార్ కు వినతిపత్రం

Date : 16 March 2023 04:30 PM Views : 445

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : CPI ML ప్రజాపంధా ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యపై రామగుండం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, గుమ్మడి వెంకన్న, తోకల రమేష్, పెండ్యాల రమేష్ హాజరై మాట్లాడుతూ* గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుండి డ్రా నిర్వహించి 160 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిందని ఏ ఒక్కరికి కూడా ఇండ్లు కేటాయించలేదని అన్నారు. తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోమ్మని ప్రకటన చేసిందని దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేసిందని పేర్కొన్నారు. అయితే దీని నుండి మళ్లీ డ్రా తీస్తామంటూ ప్రకటన చేయడం విమర్శలకు దారి తీస్తుంది. ఇదంతా లబ్ధిదారులను గందరగోళ పరిచేందుకు, నిరుపేదలను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేసారు. అధికారులతో సర్వే నిర్వహించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం అర్హత పొందిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జూపాక శ్రీనివాస్, గుమ్మడి వెంకన్న, తోకల రమేష్, పెండ్యాల రమేష్, మాజీ సర్పంచ్ తీగుట్ల రాములు, వడ్డేపల్లి పోచం, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :