Friday, 31 July 2026 12:12:57 PM

కార్మిక వర్గంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి

యూనియన్ నాయకులు అంబటి నరేష్

Date : 01 May 2023 05:34 PM Views : 640

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కార్మిక వర్గంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్మికులకు యూనియన్ నాయకులు అంబటి నరేష్ పిలుపునిచ్చారు.మే డే సందర్బంగా స్థానిక Rfcl ఎరువుల కర్మాగారం మెయిన్ గేట్ ముందు కార్మికులతో కలిసి ఎర్ర జెండా ఎగుర వేశారు. అనంతరం అంబటి నరేష్ మాట్లాడుతూ.. పెట్టుబడి సమాజం అవలంబించిన దౌర్జన్య ధోరణిపై నాటి చికాగో పోరాట వీరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులు అని కొనియాడారు. పాత fci కర్మాగారంలో అమరులైన కార్మికులకు Rfcl నిర్మాణ సమయంలో ప్రాణాలు విడిచి అమరులైన కార్మికులకు ఘనంగా నివాళులర్పించారు. నాటి పోరాట స్పూర్తితో ప్రస్తుత యాజమాన్యాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఆయన ఖండించారు.ఈ కార్యక్రమంలో లింగాల సారన్న,సార్ల ఉదయ్ కిరణ్,పంబాల మహేందర్, బండి అశోక్, బోయిని నాగరాజు మ్యాక కరుణాకర్, మర్రి రాము,కొమ్ము రాకేష్ నిమ్మల రవి, కొండపర్తి శ్రీను , కోలా చరణ్, అర్కుటి కుమార్ కొమ్మ శ్రీనివాస్, గజబింకర్ రమేష్, మర్రి కుమారస్వామి, తమ్మడవెన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :