Friday, 31 July 2026 07:55:27 PM

సిపిఐ ప్రజా పోరు యాత్ర బహిరంగ సభను విజయవంతం చేయండి.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు .

Date : 25 April 2023 07:45 PM Views : 433

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బిజేపిని గద్దె దించండి దేశాన్ని రక్షించండి అనే పేరుతో నిర్వహిస్తున్న సిపిఐ ప్రజా పోరు యాత్ర వాల్ పోస్టర్ల ను మంగళవారం గోదావరిఖని లోని సింగరేణి కాంట్రాక్ట్ పని స్థలాల విభాగాల, హమాలి కార్మికుల పని స్థలాలలో ఏఐటీయూసీ నాయకులు గడ్డం రామచందర్, కండే లక్ష్మయ్య,చంద్రారెడ్డి, సంతోష్, రమ, కొమురక్క ఐలక్క, అధ్యక్షతన ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నగర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఏ గౌస్, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ కేంద్ర కమిటీ సభ్యులు శనిగల శ్రీనివాస్ లు హాజరై మాట్లాడుతూ బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలని, ఏప్రిల్ 16 నుంచి 27 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరు యాత్రలు జరుగుతున్నాయని వారు అన్నారు. ప్రజలు, సంఘటిత అసంఘటిత కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, మేధావులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. మోడీ, కెసిఆర్, అమిత్ షా ల నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రజల సొమ్మును లక్షల కోట్లు కట్టబెడుతున్నారని ప్రజలపై భారాలను మోపుతూ కోట్ల మందిని నిరుపేదలుగా చేశారని దేశం అంటే అంబానీ ఆదాని సొత్తుగా మార్చేశారని వారు విమర్శించారు. కనీస వేతనాల చట్టాలు, చేయక పోవడం వంట నూనెలు, వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ తో సహా అన్ని నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు రెండు మూడు రేట్లు పెంచారని వారు విమర్శించారు.2014లో 410 ఉన్న గ్యాస్ బండ నేడు 1150 రూపాయలకు పెరిగిందని ఈ ధరలు పెరుగుదల వల్ల కార్పొరేట్ శక్తులు వేలకోట్ల రూపాయలు లాభాలను పోగేసుకుంటున్నారని వారు అన్నారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి బలోపేతం చేసిన ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని వారు విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండ గడుతూ ప్రజలను చైతన్య వంతం చేసి పోరాటాలకు పిలుపు నివ్వడం కోసం సిపిఐ జాతీయ సమితి ప్రజా చైతన్య పోరు యాత్ర లు చేయాలని పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా ఈనెల 26 న గోదావరిఖని చౌరస్తా లో జరిగే ప్రజా చైతన్య పోరు యాత్ర బహిరంగ సభను ప్రజలు, కార్మికులు వేలాదిగా తరలివచ్చి ఇట్టి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు జానీ మియా, గాలిపెల్లి సతీష్, బండారి రవీందర్, టి రవి, గొర్రె రాజయ్య, కొమ్ము అనిల్, కల్వచర్ల రమేష్, రాములు, రాజు, మాదాసి సమ్మయ్య,గొర్రె శ్రీనివాస్, సకినాల కుమార్, సదయ్య, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :