Saturday, 13 June 2026 02:36:00 PM

తెలంగాణలో గూగుల్‌ భారీగా పెట్టుబడులు...

రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం

Date : 04 December 2024 05:37 PM Views : 642

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో గూగుల్‌ భారీగా పెట్టుబడుల పెట్టేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే బుధవారం రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. సైబర్‌ సెక్యూరిటీకి హైదరాబాద్‌ను ప్రపంచ రాజధానిగా స్థాపించడానికి గూగుల్‌ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది గూగుల్‌.తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గూగుల్ ప్రతినిధులు.. ఈ సెంటర్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఆగస్టు 2024లో గూగుల్‌ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా రేవంత్ సర్కార్ ఒప్పించింది. దీంతో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :