Saturday, 13 June 2026 02:39:01 PM

అమిత్ షా పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్

సీనియర్ బీజేపీ నాయకుడు నల్లగుంట్ల అయోధ్య బీఆర్ఎస్ లో చేరిక

Date : 26 October 2023 06:44 PM Views : 517

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని తన నివాసంలోపలువురితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన గులాబీ కండువా కప్పి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా అయోధ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరడం సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందన్నారు.అభివృద్ధికి మద్దతు తెలుపడానికే బీఆర్ఎస్‌లో చేరానన్న అయోధ్య.. సూర్యాపేట అభివృద్ధి ముమ్మాటికీ జగదీష్ రెడ్డి ఘనతే అన్నారు. జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయంలో సమిధనవుతానని స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట మెట్రో నగరంగా రూపు దిద్దుకోవడం వెనుక జగదీష్ రెడ్డి ఎనలేని కృషి ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్న జగదీష్ రెడ్డికి పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :