ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయాలని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరుకుళ్ళ రాజనర్సయ్య డిమాండ్ చేశారు. తమను కన్వర్షన్ చేయాలని పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయం వద్ద ఆర్టీజన్లు 4వ రోజు గురువారం చేస్తున్న దీక్షా శిబిరాన్ని బీఎస్పీ నాయకులు గురువారం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యుత్తు ఉత్పత్తి, సరపరా, పంపిణీ తదితర కీలకమైన విభాగాల్లో విద్యుత్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారిని ఆర్టిజన్స్ అనే పేరు పెట్టి వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆగ్రహించారు. విద్యుత్ సంస్థలో ఒకే విధమైన పనిచేస్తున్న వారికి రెండు సర్వీస్ రూల్స్ ఎలా అమలు చేస్తారని నిలదీశారు. ఆర్టిజన్స్ అందరినీ విద్యుత్ ఉద్యోగుల రూల్స్ లో చేర్చి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు నల్ల గోపాల్ యాదవ్, కోశాధికారి పులిపాక బోందాలు, ప్రధాన కార్యదర్శి కాంపెళ్లి బాబు,పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొని సంఘీభావం తెలిపారు. దీక్షలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీజన్ కార్మికులు టివిఎసి జెఎసి జిల్లా చైర్మన్ కిషన్ రెడ్డి, కన్వీనర్ మట్టరాజు, కో-చైర్మన్ దుర్గం విశ్వనాథ్, ఫైనాన్స్ సెక్రటరీ దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి, కాంపెల్లి రఘు, జడల సత్యం, దాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News