ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని కృష్ణ న్యూరో హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్గం మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్యం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు శుభాషు, బోయిని కిరణ్ కుమార్ లు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనగా పలువురికి షుగర్. బీపీ పరీక్షల నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్.mpp.దుర్గం విజయ. హాస్పటల్ సిబ్బంది సంతోష్ కుమార్.ప్రకాష్.రాజేష్ pro. రాజ్ కుమార్,ల్యాబ్ పారా మెడికల్ హీన తదితరులు పాల్గొన్నారు..
Admin
Aakanksha News