Friday, 31 July 2026 01:34:00 PM

నరేంద్రమోడీ ని విమర్శిస్తే సహించేది లేదు

Date : 29 October 2022 09:08 PM Views : 508

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో తెరాస పార్టీ నాయకులు భారత ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని బీజేపీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత గొట్టిముక్కుల సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రగతి భవన్ బ్యానర్ పైన 400కోట్ల బడ్జెట్ తో ఫార్మ్ హౌస్ లో తీద్దాం అనుకున్న సినిమా తీరా బ్యాగులు ఓపెన్ చేసే సరికి అట్టర్ ఫ్లాఫ్ అయిందని విమర్శించారు.మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారనే ముందస్తు సర్వేల భయంతోనే కేసీఆర్, కేటీఆర్ లు ఈ డ్రామాకి తెరలేపారని ఆరోపించారు. బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి ఉండదని ఒకవేళ ఎవరైన పార్టీలోకి రావలనుకుంటే ముందస్తుగా వారితో పదవులకు రాజీనామా చేయించి తీసుకుంటారని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైయారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ట్రేడ్ టాక్స్ లో పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెంచారని దీనివలన సమాన్యులపై తీవ్ర భారం పడనుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30లక్షలతో ICU సెటప్ చేయించి దానికి సంబంధించిన పరికరాలు తెప్పిస్తే స్థానిక శాసనసభ్యులు తమ స్వార్ధ రాజకీయాలు కోసం ఇప్పటి వరకు ప్రారంభించలేదని,ఒక నెల లోపల మీరు ప్రారంభిస్తే మేము స్వయంగా మీ ఫొటోలకు పాలాభిషేకం చేస్తామని తెలిపారు.ఇకనైనా స్థానిక నాయకులు భారతీయ జనతా పార్టీని విమర్శించడం మానేసి ప్రజాసంక్షేమం మీద దృష్టి కేంద్రీకరించాలని బీజేపీ పార్టీ పైన కానీ మా నాయకుల మీద కానీ అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని ప్రజలే రాబోయే రోజుల్లో తెరాస పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్కూరి సత్యనారాయణ రెడ్డి, మోలుగురి రాజవీరు, పట్టణ ప్రధాన కార్యదర్శి మోరే మనోహర్ ఉపాధ్యక్షులు ఠాకూర్ క్రాంతి సింగ్, అడ్వకేట్ నాయిని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, పడాల శ్రీధర్,మాజీ బీజేవైఎం ఉపాధ్యక్షుడు, మోసం శ్రీధర్,కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, తివారి,ఎళ్లేంకి పోచాలు,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :