Thursday, 30 July 2026 03:58:00 PM

వినాయక మండపాలను సందర్శించిన కందుల సంధ్యారాణి

Date : 20 September 2023 07:11 PM Views : 690

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అంతర్గం మండలం లింగాపురం గ్రామంలోని పలు వినాయక మండపాలను పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి సందర్శించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు, ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ తాము సంకల్పించిన పనులు నెరవేరాలని అన్నారు. అనంతరం పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరి ఇంట్లో చిరునవ్వును నింపాలని గణేశుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు వినాయక మండప కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :