Friday, 31 July 2026 03:49:18 PM

అక్రమ కేసులు బనాయిస్తున్నారని పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ నిరసన

Date : 16 April 2023 01:31 PM Views : 456

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..బీ.చెల్పూర్‌ గ్రామ సర్పంచ్‌ నేరేళ్ళ మహేందర్‌ గౌడ్‌, వార్డు మెంబర్‌ మహ్మద్‌ ఇబ్రహీమ్‌ పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు.అంతే కాకుండా వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారని.. హుజురాబాద్‌ సీఐ బొల్లం రమేష్‌ పై చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.పొలీసులు బీఆర్‌ఎస్‌ కు తొత్తులుగా వ్యవహరిస్తూ ..బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఇకనైనా పోలీసులు తమపై వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :