ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిర్మల్ జిల్లా : సొంత శాఖలోనే పనిచేస్తున్న ఓ ఉద్యోగి వద్ద లంచం కోసం వేధించడంతో జెసిబి అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. దీంతో పక్క సమాచారంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న భరత్ అనే బిల్ కలెక్టర్ సర్వీస్ బుక్ ఎంట్రీ కొరకు డబ్బులు డిమాండ్ చేయడంతో భాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Admin
Aakanksha News