Saturday, 01 August 2026 01:24:46 AM

ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వాదనలు....

Date : 02 December 2024 06:07 PM Views : 342

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ములుగు జిల్లా : ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో ) సోమవారం విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని వాదించారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్నారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌరహక్కుల సంఘం న్యాయవాది పేర్కొన్నారు.అయితే అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలకు విన్న హైకోర్టు.. మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రేపటికి (మంగళవారం) హైకోర్టు వాయిదా వేసింది.కాగా.. ఏలూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కు సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విష ప్రయోగం జరిగందని హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని.. వైద్య నిపుణుల సమక్షంలో పోస్ట్ మార్టం చేయాలని... పోస్ట్ మార్టం సమయంలో వీడియో రికార్డ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :