Saturday, 13 June 2026 02:39:22 PM

భక్తులతో కిటకిటలాడుతున్న రాజన్న ఆలయం

Date : 21 November 2022 03:26 PM Views : 545

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కిటకిటలాడుతోంది. ‘‘ హర హర మహా దేవ.. శంభో శంకర..’’ శివ నామ స్మరణలతో రాజన్న క్షేత్రం పరిసరాలు మార్మోగుతున్నాయి.తెల్లవారుజామున నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి కోడే మొక్కులు చెల్లించి స్వామివారికి అభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి సుమారుగా 6 గంటల సమయం పడుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :