Friday, 31 July 2026 01:15:49 PM

క్రీడలతో ప్రాంత ఖ్యాతిని పెంచాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

షాద్ నగర్ ప్రీమియర్ లీగ్4 ఫైనల్

Date : 22 January 2024 10:29 PM Views : 474

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా :

కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ నియోజక వర్గo మినీ స్టేడియంలో క్రికెట్ షాద్ నగర్ ప్రీమియర్ లీగ్4 ఫైనల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని, మానసికొల్లాసం లభిస్తుందన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపి మన ప్రాంత పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ యువతకు పోటీలు నిర్వహించి, ప్రోత్సహించడం ఎంతో గొప్ప విషయం అని ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. ఓడిన వారు ఛాలెంజ్ గా తీసుకొని భవిష్యత్ లో గెలువటానికి ప్రయత్నం చేయాలన్నారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని, ఓటమి గెలుపకు నాంది కావాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం లో పోటీలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కొంకళ్ళ చెన్నయ్య, రాజేందర్ రెడ్డి,మురళీమోహన్(అప్పి),అగ్గనూర్ బస్వo, పెంటయ్య, రాజు గౌడ్,ప్రవీణ్, అంజద్ ఖాన్ కబీర్, మతీన్, మహమ్మద్, రవి తేజ, మనీష్, నర్సిo మా,నరేష్,శేఖర్,జగదీశ్వర్ ముదిరాజ్ , చిన్న తదితరులు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :