Saturday, 13 June 2026 02:31:50 PM

అత్తా కోడళ్ళు సఖ్యతగా ఉంటేనే ఆరోగ్యకరమైన కుటుంబం...

ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్

Date : 28 December 2024 10:03 PM Views : 424

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అత్తా కోడళ్ళు సఖ్యతగా, అన్యోన్యంగా ఉండటం వలన కుటుంబ బాంధవ్యాలు గట్టిపడటమేకాకుండా కుటుంబం సంతోషం తో వెళ్లివిరియగలదని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ అన్నారు.అత్తా కోడళ్ళు సఖ్యతగా ఉంటే కుటుంబం ఆరోగ్యకరమైన వాతావరణం లో మేళియగలదని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం లో జరిగిన బుక్ ఫెయిర్ ను ఆయన సందర్శించిన సందర్భంగా"అక్షర యాన్ విమెన్ రైటర్స్" సంస్థ నుండి "అత్తగారి కథలు - హాస్య కథలు" రచించిన ప్రముఖ కథా/ నవలా రచయిత్రి శ్రీమతి తోలేటి అరుణ గారి కథలపుస్తకాన్ని కొనుగోలు చేస్తూ ఆమె పుస్తకాన్ని కొనియాడారు. అక్కడి పుస్తకాలను ఆయన పర్యవేక్షించి చూడగా హస్యకథల తో రూపొందించబడిన అత్తా కోడళ్ళ కథలు, ఇతర హాస్య కథలు కూడా ఈ పుస్తకం లో పొందుపరచి ఉండటం ఆశక్తి కలిగినదని స్వయంగా కొనుగోలు చేయడం, సహ మిత్రులతో చేయించడం జరిగినదని తెలిపారు.హాస్యం ఎటువంటి పరిస్థితి లోనైన మనిషికి తక్షణ ఔషదం గా పనిచేసి మనసుకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. కథల లో హాస్యం తో బాటు చక్కని సందేశం, చిక్కని కథాంశం కూడా దాగి ఉన్నట్టు కొంత మేర చదివిన పిమ్మటనే తెలిసినది.. యాదృచ్చికంగా అప్పుడే అక్కడకు విచ్చేసిన ప్రముఖ రచయిత్రి అరుణ తోలేటి ని కూడా కలవటం జరిగింది.ఇటువంటి కథలు వల్ల కుటుంబ వ్యవస్థలోఅత్తా కోడళ్ళ మధ్య నున్న సునిశిత సత్సంబంధాల విలువ తెలుస్తుంది..చక్కని బాంధవ్యాలు నెలకొంటాయి అనడం లో సందేహమే లేదు. తద్వారా సమాజ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి అని తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వెలిబుచ్చారు. .ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు శ్రీనివాస్ ఆనంద్ రెడ్డి, రాజేశ్వరరావు. భువనేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :