Saturday, 13 June 2026 02:37:41 PM

త‌నపై సొంత పార్టీకి చెందిన వారే దాడికి య‌త్నించారు...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగ‌ణేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Date : 21 July 2025 07:34 PM Views : 450

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : త‌నపై సొంత పార్టీకి చెందిన వారే దాడికి య‌త్నించార‌ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగ‌ణేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బోనాల పండుగ‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ఉస్మానియా యూనివ‌ర్సిటీ మాణికేశ్వ‌ర్‌న‌గ‌ర్‌లో ఫ‌లహారం బండి ఊరేగింపు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నంపై దాదాపు 20 మంది దాడి చేసేందుకు య‌త్నించారు. అద్దాలు దించాలంటూ కారును వెంబ‌డించారు. అయితే అప్ర‌మ‌త్త‌మైన ఆయ‌న గ‌న్‌మెన్‌లు కారును నేరుగా ఓయూ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న పార్టీకి చెందిన వారే దాడికి య‌త్నించార‌ని చెప్పారు. ఉద్దేశ పూర్వ‌కంగానే చేశార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :