Friday, 31 July 2026 08:30:01 PM

అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ...

కన్నుల పండువగా శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవం... వైభవంగా సాముహీక వివాహాలు..

Date : 16 February 2023 07:54 PM Views : 661

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కన్నుల పండువగా అంగరంగ వైభవంగా విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని శ్రీ కొదండ రామాలయంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవంతో పాటు సాముహీక వివాహాలను ఆరు మంది జంటలకు దైవ సన్నిదిలో కళ్యాణం జరిపించారు.విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పేద జంటలకు పుస్తే మట్టెలు బట్టలు వివాహ సామాగ్రిని అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి హాజరై శ్రీ శ్రీనివాసుని కళ్యాణంలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం జన్మించిన కారణ జన్మల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం అంటే రాష్ట్రమంతా పండుగ రోజు అని అన్నారు. ఆకలిచావులు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి ప్రజలందరు సుఖసంతోషాలతో వర్దిలేలా చూస్తున్నరని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని ఆశీస్సులతో సీఎం కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికి తమ పరిపాలన అందించే విధంగా శ్రీనివాసుడు ఆశీర్వాదం అందించాలని అన్నారు.నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాలను మంజూరు చేసి ప్రారంభింప చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు రామగుండం ప్రజల అందరం రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ ‌‍అనిల్ కుమార్ నాయకురాలు మూల విజయ రెడ్డి డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు జడ్పీటిసీ అముల నారాయణ మాజీ మేయర్ కోంకటి లక్ష్మినారాయణ కార్పోరేటర్లు అడ్డాల స్వరూప రామస్వామి దొంత శ్రీనివాస్ పెంట రాజేష్ సాగంటి శంకర్ ఇంజపురి పులిందర్ దాతు శ్రీనివాస్ అడ్డాల గట్టయ్య కల్వచర్ల కృష్ణావేణీ భూమయ్య బాదె అంజలి పాముకుంట్ల భాస్కర్ కవిత సరోజినీ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ పి.టి స్వామి నూతి తిరుపతి పర్లపల్లి రవి నారాయణదాసు మారుతి గంగ శ్రీనివాస్ కాల్వ శ్రీనివాస్ జె.వి.రాజు చెలకలపల్లి శ్రీనివాస్ అచ్చే వేణు దీటి బాలరాజు మేకల సమ్మయ్య యాదవ్ మెడి సదయ్య మెతుకు దేవరాజ్ బోడ్డుపల్లి శ్రీనివాస్ మండ రమేష్ ఎడేల్లి శ్యాం అనుముల కళావతి ఇసంపల్లి తిరుపతి ఆడప శ్రీనివాస్ ఇనుముల సత్యం జిట్టవేన ప్రశాంత్ జడ్సన్ దాసరి శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావన్ బంధే నాగభూషణం నాగలక్ష్మి సంధ్యా రెడ్డి గోలివాడ చంద్రకళ శాంతలక్ష్మి స్వాతి తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :