Thursday, 30 July 2026 09:53:26 PM

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి...

దీక్ష రెండవ రోజు మద్దతు ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు..

Date : 11 December 2024 09:17 PM Views : 622

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లాలోని పాత కలెక్టరేట్ దగ్గర విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు కదం తొక్కారు.ఈ సందర్బంగా సమగ్ర శిక్ష అభియాన్ జెఎస్సి జిల్లా అధ్యక్షుడు మురళి మాట్లాడుతు.. తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు ఆందోళన చేపట్టారు.తక్షణమే రెగ్యులర్ చేయాలని ప్లకార్డులతో నిరసనను వ్యక్తం చేశారు. కేజీబీవీ సీఆర్టీలు,సీఆర్పీలు, డీఎల్ఎంటీ, సీసీఓ, పీటీఐ, మెసెంజర్, యూఆర్ఎస్,ఉద్యోగ,ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు జె .శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రరావు, రాజిరెడ్డి, విజయ్ కుమార్, సురేందర్ రెడ్డి, చిరంజీవులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :