Friday, 31 July 2026 04:41:03 PM

కేసీఆర్ మాయ మాటలు నమ్మి మోసపోకండి...

బీఎస్ పీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ గోలివాడ ప్రసన్నకుమార్..

Date : 17 October 2023 11:43 AM Views : 956

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేసీఆర్ మాయ మాటలు నమ్మి ప్రజలు ఎవరు మోసపోవద్దని బీఎస్ పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ గోలివాడ ప్రసన్నకుమార్ (గంగపుత్ర) అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత తొమ్మిది సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల చెవిలో పువ్వులు కాదు.. క్యాలీ ఫ్లవర్లు పెడుతున్నారని ఆయన విమర్శించారు. క్యాలీ ఫ్లవర్లను చెవిలో పెట్టుకొని విన్నూత నిరసన తెలిపారు. సిద్దిపేట ఇతర జిల్లాలో డబల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసి, రామగుండం నియోజకవర్గంలో ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. పంపిణీ చేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ప్రజలకు ఇవ్వలేదన్నారు.9 సంవత్సరాల పాలనలో 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఇన్ని సంవత్సరాల పాలనలో ప్రభుత్వం నిద్రపోయిందా అని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ కు ఓటు వేస్తే 20 సంవత్సరాల పాలన వెనక్కి వెళ్ళినట్లే అని అన్నారు. ప్రభుత్వం బానిసలుగా మార్చుతుందన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మొత్తం మోసాల కుట్ర అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడుతున్నారని ఈ ఎన్నికల్లో బీఎస్ పీ పార్టీ ప్రవీణ్ కుమార్ ను ఆదరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సది. శ్రీనివాస్, సంపత్, మధు, మల్లేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :