ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రస్తుతం జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం సగం పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇవ్వాలని ఆయన కోరారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇన్ని అన్ని టికెట్లు ఇస్తాం అన్ని చెప్పి మోసం చేశారనిఈ ఎన్నికల్లోనైనా బీసీలకు 9 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ఆయా రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు బీసీలకు కావాల్సింది రాయితీలు కాదని రాజ్యాధికారంలో వాటా కావాలని రాజ్యాధికారం బీసీలకు సాధించినప్పుడే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు ఈరోజు బిజెపి ప్రకటించిన 6 పార్లమెంట్ స్థానాల్లో మూడు బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఇధె విధంగా మూడు పార్టీలు సగం పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు బీసీలు ఓట్లు వేస్తారని లేకుంటే తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు
Admin
Aakanksha News