Thursday, 30 July 2026 11:34:05 AM

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని10న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి...

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు

Date : 07 December 2024 03:54 PM Views : 452

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రము లో 16లక్షల 75వేల మంది విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు . బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన బీచి భవన్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి పోస్టర్ ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిలు రాకపోవడంతో కళాశాలల ఫీజులు కట్టడానికి, ఉన్నత చదువులు చదువుకోవడానికి విద్యార్థులు తమ రక్తాన్ని, కిడ్నీలను అమ్ముకుంటున్నారని ఆందోళ న వ్యక్తం చేశారు.విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే విద్యార్థుల ఉలమైన భవిష్యత్కు ఆటంకం క ల్లిస్తోందని ఆరోపించారు. కమీషన్ల కోసం కంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారే తప్ప విద్యార్థు లు ఆకలి చావులకు బలవుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రజా, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమా న్ని మరింత బలోపేతం చేస్తామని వారు హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరు తో రూ. లక్షన్నర కోట్ల బడ్జెట్ ను ఖర్చుచేస్తోం దని, ముందుగా విద్యార్థుల భవిష్యత్ ను సుందరీకరణ చేయాలని అతర్వాతే మూసీ సుందరీకరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీల వెంకటేష్, సి.రాజేందర్, చంద్రశేఖర్, రాందేవ్ మోదీ, నిఖిల్, బాల య్య, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :