Thursday, 30 July 2026 02:30:25 PM

ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపించారు...

తొందరపాటు విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ

Date : 23 January 2024 03:56 PM Views : 545

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ :

Also Read : ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపించారు...

ఐటీ మంత్రి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...

కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎంతో విశ్వాసాన్ని చూపించారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు ప్రజలకు ఒక మంచి మేనిఫెస్టో అందించామని వెల్లడించారు. ఈ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఇచ్చామని వాటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీలో రూ.10లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు తొందరపడి చేస్తున్న విమర్శలు పట్టించుకుంటే సంక్షేమ పథకాలు ముందుకు సాగమని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయన్నారు. వారు చేస్తున్న విమర్శలను పట్టించుకుంటే పనులు జరగవని అభిప్రాయపడ్డారు. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తామన్నారు.ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :