ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : పేదింటి వధువు..దివ్యాంగురాలు పెళ్ళికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణు గోపాల చారి మరియు తెలంగాణ యునైటెడ్ మోటర్ వైండింగ్ వర్కర్, ఫెడరేషన్ అధ్యక్షులు కాయతోజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్దిక సహాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల పేద విశ్వబ్రాహ్మణ కుటుం బానికి చెందిన కీర్తిశేషులు ఇమ్మడోజు తారయ్య-స్వరూప గార్ల ప్రథమ పుత్రిక చి"ల"సౌ" సరిత ( కల్యాణి)- చి" శ్రీనివాస్ వధూవరులు ఇద్దరూదివ్యాంగులే వారి వివాహా ఖర్చుల నిమిత్తం ఔదార్యం గల దాతలు కలిసి 28 వేల రూపాయల ఆర్థిక సహాయం తో పాటు నూతన వస్త్రాలను వారికి అందజేశారు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాల చారి కరీంనగర్ జిల్లా తెలంగాణ మోటార్ వైండింగ్ వర్కర్ వెల్ఫేర్ ఫెడరేషన్ సంఘ నాయకుడు కాయితోజు పవన్ కుమార్ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి ఉదారం శ్రీనివాస్ జిల్లా కోశాధికారి ఇమ్మడోజు భద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు చల్లోజు సత్యనారాయణ, తుంబోజు లక్ష్మీనారాయణ పర్ఫెక్ట్ ప్లైవుడ్ సెంటర్, శ్రీమంతుల సదాశ్రీ ధరణి యూట్యూబ్ ఛానల్, వంగల సత్యం అండ్ వంగల బ్రదర్స్ జ్యువెలరీ,విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం కరీంనగర్ మండల అర్బన్ అధ్యక్షులు గర్రెపల్లిశ్రీనివాస్, చొప్పదండి మండల ప్రధాన కార్యదర్శి ఉదారం కనుక చారి,( డాక్టర్ ) పాలోజు విజయ్ కుమార్ చారి, విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం జిల్లా కన్వీనర్ శ్రీరామోజు రవీంద్ర చారి,నగర కన్వీనర్ తిప్పారపు శ్రీనివాస్ ,కలికోట మోహన్ చారి ఓంకార్ టింబర్ డిపో, జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రోజు లక్ష్మీనారాయణ పుప్పాల మహేష్ గీతాశ్రీ గ్రానైట్, శానగుండ నరేష్ , ఆలేటి సత్యవతి, జవ్వాజి వెంకటలక్ష్మి , జర్నలిస్ట్ ఉప్పుల సురేష్ , నల్లమాజు సంతోష్ ,కడారి శాంత శ్రీనివాస్, గంగాధర లక్ష్మీనారాయణ, మియాపురం జనార్ధన్ అండ్ కమల్ సౌండ్స్ బ్రదర్స్, గొల్లపల్లి శంబయ్యలు అందించి నూతన వధూవరులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారికి ఆశీస్సులు అందించగా ఆర్ధిక సహాయం అందించిన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Aakanksha News