ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక లవిధానాలపై నిరంతర పోటాలు కొనసాగించాలని భారత కార్మిక సంఘాల సమస్య (ఐ ఎఫ్ టి యు) ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి ప్రదీప్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా 8వ మహసభ ఎన్టీపీసీ లోని టివి గార్డెన్ లో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బి ప్రదీప్ పాల్గొని మాట్లాడారు..భారతదేశంలో గత యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన నూతన భారత విధానాలు నేడు అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మరింత వేగవంతం చేసిందన్నారు మోడీ ఆయంలో ప్రభుత్వ రంగం పూర్తిగా కార్పొరేట్ శక్తులకు వెళ్లిందని కార్మిక చట్టాలను సమూలంగా సమాధి చేయటానికి 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోడలుగా తీసుకురావడం జరిగిందన్నారు.ఇంతకాలం పరిశ్రమల్లో అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఎత్తివేసారని అన్నారు. దేశంలో కార్మిక సంఘాలు ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. వీటిని అణిచివేయటానికి తీవ్రమైన దాడులని ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక విధానాలకు కార్మిక వర్గం సంగటిత పోరాటమే మార్గమన్నారు. 1978 గౌహతి ఉద్యమాలు నుంచి మొదలుపెడితే నేటి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.ఆనాడు తెల్ల దోరలు కార్మికుల్ని 24 గంటల పని చేయించుకొని కట్టు బానిసలుగా చేసినటువంటి స్థితి నుండీ కొట్లాడి హక్కులు సాధించుకొని ఎనిమిది గంటల పని విధానం తీసుకొచ్చుకున్నామని కానీ నేడు అదే ముసుగులో కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి,రక్త తరఫున చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ఈనాడు పాలకవర్గాలు ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిందని ఆయన అన్నారు.నవరత్నాల పేరుతో ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేసి చేతులు దులుపు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందు గానే వ్యవహరిస్తూ కార్మికుల్ని కార్మిక హక్కులని కాలరాస్తూ కట్టు బానిసలుగా మార్చివేసి పర్మినెంట్,కాంటాక్ట్ బేసిక్ నుంచి డైలీ వేజ్ వర్కర్లుగా మార్చే పరిస్థితికి నెట్టబడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పర్మినెంట్ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు డైలీ వేజ్ వర్కర్లు అందరూ ఐక్యంగా ఉద్యమించిన రోజు మాత్రమే కార్మిక హక్కులని కాపాడుకోగలుగుతామని వారు అన్నారు. దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కస్తూరిబా డైలీ వేజ్ ఆశ్రమం పాఠశాలలో సింగరేణి సంస్థ కేటీపీఎస్ జెన్ కో అనేక సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను పక్కనపెట్టి కాంట్రాక్ట్ పని చేపిస్తూ వారి శ్రమ దోపిడి చేస్తున్నారని తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించి పోరాడాలని రాబోతారం మొత్తం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News