Saturday, 13 June 2026 02:42:55 PM

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలన్ని అభివృద్ధి

రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్

Date : 06 October 2023 02:19 PM Views : 449

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రామగుండం శాసనస భ్యులు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ప్రధాన రోడ్లు డ్రైనేజీ ముదిరాజ్ సంఘం భవన నిర్మాణం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రహారి గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో పల్లెల అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత పల్లెల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ వైకుంఠ గ్రామాలు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పల్లెలను పచ్చదనంతో విరాజిల్లేలా కృషి చేశారని చెప్పారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సహకారం అయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహిళలకు బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకత ఉంటుందని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీరలు అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ సంక్షేమానికి ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రతి రెండు నెలలకు ఒకసారి మహిళామణులంతా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రామగుండం నియోజకవర్గ పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం గోదావరిఖనిలో మెడికల్ కళాశాలను ప్రారంభించామని ఎవరికైనా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న మెడికల్ కళాశాలలో ఉచితంగా వైద్య సదుపాయాలను పొందవచ్చని అన్నారు.మన కోసం మన సంక్షేమం కోసం పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ని రామగుండంలో తమను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, ఎంపిపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, నాయకులు కౌషిక హరి, సర్పంచ్ లు మెరుగు పోశం, ధరని రాజేష్, ధర్మాజీ కృష్ణ, బాదరవేని స్వామి, బండారి ప్రవీన్, తుంగపిండి సతీష్, కొల లత, కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్, ఎదులపూరం వెంకటేష్, నూకరాజు మల్లయ్య, కోల్లూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :