Saturday, 13 June 2026 02:37:39 PM

తొత్తు సంఘాలకు జేబులు నిండాలంటే కార్మిక సమస్యలు పరిష్కారం కావద్దు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి.

Date : 24 March 2023 03:00 PM Views : 673

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తొత్తు సంఘాలకు జేబులు నిండాలంటే కార్మిక సమస్యలు పరిష్కారం కావద్దని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జీడికే 2A ఇంక్లైన్ లో పిట్ కార్యదర్శి వంగళ శివరామ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు..గుర్తింపు కాలపరిమితి ముగిసినప్పటికీ ఇంకా గుర్తింపు సంఘం అంటూ ఓకే యూనియన్ ను గుర్తించడం సరికాదని అన్ని యూనియన్లతో మైన్స్ సేఫ్టీ కమిటీ సమావేశాలు ఎన్నికలు అయ్యేంత వరకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కార్మికుల అనుకూలమైన అనేక పెండింగ్ సమస్యలు పరిష్కారానికి నోచుకోక మళ్లీ అవే డిమాండ్లను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ప్రస్తావిస్తున్నారన్నారు. ఓడిన సంఘాలను మాట్లాడనీయకుండా ఉండెందుకు యాజమాన్యంతో కలిసి కొన్ని యూనియన్లు కోడ్ ఆఫ్ డిసిప్లేన్ మార్చడానికి ఒప్పుకోవడం లేదని విమర్శించారు ఎన్నికల ప్రక్రియ మొదలుకాక ముందే పెండింగ్ లో ఉన్న RLC వద్ద అగ్రిమెంట్ చేసిన 13 డిమాండ్లపై సర్కులర్ ఇవ్వాలని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ తో సంవత్సరంలో మూడు నాలుగు నెలల జీతం నష్టపోతున్న కార్మికులకు 2011 లో చేసిన అలవెన్స్ పై ఐటి మాఫీ కోలిండియా ఒప్పందాన్ని అధికారులు అమలు చేసుకున్నట్లు కార్మికులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్మెట్ రేడియం జాకెట్లు సేఫ్టీగా పరిగణించే అధికారులు సేఫ్టీ కమిటీ సమావేశాల్లో ఎన్నిసార్లు గనుల్లోకి దిగి పర్యవేక్షణ చేశారో చెప్పాలని నాసిరకం పనిముట్లు, కార్మికుల ఆరోగ్యానికి సైతం L1 టెండర్ల తక్కువ ఖరీదుకు దొరికే మందులు ద్వారా వచ్చే మందులను ఎందుకు ఇస్తున్నారని విమర్శించారు. వయసు మల్లిన కార్మికులను, మరియు అన్ని డెసిగ్నేషన్ కార్మికులకు సర్ఫేస్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికులకు 11 వ వేతన ఒప్పందాన్ని కావాలని ఆలస్యం చేస్తున్నదని త్వరలో మెరుగైన వేతన ఒప్పందానికి మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేసేందుకు యాజమాన్యంపై వివిధ రూపాల్లో ఒత్తిడి చేస్తున్నామని, కోల్ బెల్ట్ ఎం.ఎల్.ఏ.లకు కూడా సొంతింటి పథకం కింద ఎవరి క్వాటర్ వారికే ఇవ్వాలని వినతి పత్రాలు ఇస్తున్నామని అయినా కూడా రాజకీయ జోక్యంతో యాజమాన్యం పట్టించుకోవడంలేదని అన్నారు. కార్మిక సమస్యలపై నిరంతరం కార్మికులకు అవగాహన కల్పిస్తూ పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ కు కార్మికులందరూ మద్దతు తెలిపాలని సీఎం పిఎఫ్ వారు కార్మికులకు తెలవకుండా లక్షకి 500 రూపాయల చొప్పున నష్టం కలిగించిన దాన్ని కూడా కార్మికులకు తిరిగి ఇప్పించడం జరిగింది కార్మికులకు ప్రతి హక్కు కాపాడి ఇవ్వడానికి నిరంతరం ప్రతి హక్కు పై కాపలాగా ఉంటున్నామని ఈ సందర్భంగా కార్మికులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అర్జీ1 కార్యదర్శి మెండే.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఎస్కే గౌస్, ఆరెపల్లి రాజమౌళి, శ్రీనివాసరావు, బూర్గుల రాములు, పిట్ కార్యదర్శి, వంగల శివరాంరెడ్డి, లక్ష్మణ్, గడికొప్పుల దుర్గాప్రసాద్, పల్లె గట్టయ్య, చాగంటి యాదగిరి, ఇనుగాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :