ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గీత కార్మికుల జీవనోపాధికి 10 ఎకరాల ప్రభుత్వభూమి కేటాయించాలనీ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు. అదివారం హైదరాబాదులో మంత్రిని ఎమ్మెల్యే కలిసారు. గోదావరిఖని ఎన్టీపీసీ FCI ఓసిపి విస్తరణ మూలంగా గీత కార్మికులు ఈత వనం లేకుండా పోయిందని పాలకుర్తి, అంతర్గాం మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని గీత పారిశ్రామిక సహాకార సంఘం గ్రూప్ నెంబర్ 1 కెటాయుంచాలన్నారు. ఎమ్మెల్యే వెంట సంఘ నాయకులు రవీందర్ గౌడ్ సురేందర్ రాజ్ కుమార్ కృష్ణా శ్రీనివాస్ కుమార్ ఉన్నారు.
Admin
Aakanksha News