ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బట్టలు ఉడదీసి కొడతానని బిజెపి పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....గతంలో వివేక్ వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిచి లక్షల కోట్లు సంపాదించి ప్రజలను మోసం చేశారని, పెద్దపల్లి నియోజకవర్గంను ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా గెలిచి తండ్రి కొడుకులు లక్షల రూపాయలతో ఇతర రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు పెట్టి పెద్దపల్లి ప్రజలకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించకుండా మోసం చేసారని పేర్కొన్నారు. వివేక్ ను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు తమ ఆస్తులను పెంచుకున్నారు కానీ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వివేక్ వెంకటస్వామి కుటుంబ పాలన నడుస్తుందని ఆరోపించారు. అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తమ్ముడు చేన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నారని, ఇప్పుడు వివేక్ కుమారుడు పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారని తమ ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో వివేక్ వెంకటస్వామి నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజకీయ సేవాభావం లేనటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి అని అన్నారు. 20 సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంకటస్వామి రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందే అని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే వివేక్ వెంకటస్వామి గురించి సొంత పార్టీలోనే గుసగుసలు పెట్టుకుంటున్నారని రాజకీయంగా తన ఆస్తులను పెంచుకుంటూ రాజకీయపబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.
Admin
Aakanksha News