Thursday, 30 July 2026 11:16:26 AM

ఘనంగా విశ్వావసు నామపంచాంగ ఆవిష్కరణ...

పంచాంగాన్ని ఆవిష్కరించిన ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ

Date : 29 March 2025 07:29 PM Views : 699

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో విశ్వావసు నామసంవత్సర పంచాంగాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఎల్బీనగర్ లోని సువర్ణ గోశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సాయంత్రం ఏడు గంటలకు ప్రముఖ ప్రవచన కర్త శ్రీనివాస బంగారయ్య శర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షులు వేముల వెంకటకిషన్ రావు, ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్, రాష్ట్రాల కార్యవర్గ సభ్యురాలు ఉజ్వల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస బంగారయ్య శర్మ నీ పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస బంగారం ఎస్ శర్మ మాట్లాడుతూ సనాతన ధర్మంలో పంచాంగం ప్రాముఖ్యత ఎంతగానో ఉందన్నారు. హిందువులు ఏ పని చేయాలన్న, ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా ముహూర్త బలం చూసుకుని ఆ పనులను చేసుకోవడం అనాది ఆచారంగా వస్తుందన్నారు. మనిషి మనుగడకు పంచాంగం ఒక ముఖ్యమైన సాధనమన్నారు. మనిషి వేసే ప్రతి అడుగుకు పంచాంగం అవసరమని చెప్పారు. ముఖ్యంగా బ్రాహ్మణుడు అనేవారు తప్పనిసరిగా పంచాంగం కలిగి ఉండాలని అప్పుడే ఆయన ఇతరులకు మార్గదర్శనం చేయగలరని చెప్పారు. పంచాంగాన్ని చదవడం కాదు మన పిల్లలకు కూడా చూడడం చదవడం నేర్పించాలని చెప్పారు. "ధర్మో రక్షతి రక్షితః"ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుందన్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు వేముల వెంకట కిషన్ రావు మాట్లాడుతూ పంచాంగానికి మనిషి జీవితానికి ముడిపడి ఉందన్నారు. పంచాంగం లేనిదే మన దినచర్య సాగదని చెప్పారు. తి థి వార నక్షత్ర యోగ కరణం. రైతు లకు ఏ కాలం లో పంట లకు అను కూ ల లో పంచాంగం తెలియ చేసి వారికి ఉపయోగ పరుస్తూ లాభం కలిగిస్తుంది. ఉన్నత చదువుల పేరుతో మన పిల్లల్ని మనమే పంచాంగానికి సనాతన ధర్మానికి దూరం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యత పరిచ్చారు. బ్రాహ్మణలు మనం మన ధర్మాన్ని కాపాడినప్పుడే అది మనలను కాపాడు తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామన్ పలువురు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :