Sunday, 26 April 2026 05:34:24 PM

48 వాహనాలను ఢీ కొట్టిన ట్యాంకర్

Date : 21 November 2022 12:06 PM Views : 454

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పూణె – బెంగళూరు నేషనల్ హైవేపై ఉన్న నావల్ బ్రిడ్జ్పై వేగంగా దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 కార్లు దెబ్బతిన్నాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో భారీగా డ్యామేజ్ జరిగింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో ట్యాంకర్ నుంచి ఆయిల్ కిందపడటంతో వాహనాలు గ్రిప్ మిస్ అయ్యి ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :