Friday, 31 July 2026 11:39:41 PM

విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్...

Date : 17 November 2024 06:21 PM Views : 572

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఖమ్మం జిల్లా : ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థికి గుండు కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదివే విద్యార్థి చైనా వారిలా కటింగ్ చేయించుకొని కాలేజీకి వెళ్ళాడు. అది చూసి సెకండ్ ఇయర్ విద్యార్థులు మెడికల్ కాలేజీలో చదువుతూ ఇలా కటింగ్ చేపించొద్దని చెప్పడంతో, ఆ విద్యార్థి సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్(సర్జన్) ఆగ్రహించి విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు.. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడంతో, ర్యాగింగ్ నిర్ములించాల్సిన ప్రొఫెసరే, ర్యాగింగ్ చేయడమేంటని విమర్శలు వచ్చాయి.విద్యార్థి ఫిర్యాదుతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించామని.. ఈ ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లి విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని ప్రొఫెసర్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :