Thursday, 30 July 2026 09:14:25 PM

ఉద్యమకారుల హక్కుల కోసం ఉద్యమకారుల సమితి ఆవిర్భావం..

Date : 22 November 2024 08:27 PM Views : 634

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన ఉద్యమకారులందరికీ వారి హక్కుల పోరాటం కోసం ఉద్యమకారుల సమితి అండగా నీలుస్తుందని సంఘం బాద్యులు పేర్కొన్నారు. శుక్రవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సమితి (TRUS)ని ఆవిర్భావించారు.తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా ఉద్యమాల గడ్డ అయిన నర్సంపేట నియోజక వర్గంలో TRUS స్థాపించడం జరిగిందని తెలిపారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.ఈ సంఘం ఉద్యమ కారుల హక్కుల కోసం నిరంతరం పాటు పడుతుందని 2001 నుండి ఉద్యమంలో పని చేసి నష్ట పోయినా ఉద్యమ కారులు అందరికి అండగా ఉంటుందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్యం ఉద్యమ కారులకు మేనిఫెస్టో ప్రకారంగా ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. త్వరలో గ్రామ, మండల,పట్టణ, నియోజకవర్గ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటామన్నారు. నర్సంపేటలో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించి హక్కుల కోసం ఉద్యమిస్తుందని అన్నారు. ఈ సంఘం ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మచ్చిక నర్సయ్య గౌడ్, దార్ల రమాదేవి, బైరి తిరుపతిరెడ్డి, గుండెకారి రంగారావు, కుంచారపు వెంకటరెడ్డి, గాదే భద్రయ్య , గాదే జనార్దన్ రెడ్డి, అప్పాల సుదర్శన్, డ్యాగల శ్రీనివాస్, పులిగిల్ల యాదగిరి, తనుగుల సుధాకర్, కొర్ర గవర్ సింగ్, పెండ్యాల యాదగిరి, జమండ్ల చంద్రమౌళి, బానోత్ కిషన్ నాయక్, పల్నాటి సాంబయ్య, దొంగల సురేష్ వల్లెపు శ్రీనివాస్, మోడం విద్యాసాగర్, పెండ్యాల కృష్ణ, కాలె రాజు. దోనాల రవి, మునిగాల సాయికృష్ణారెడ్డి. పెరుమాండ్ల ప్రభాకర్ రెడ్డి, ఇర్ఫాన్, గండ్లోజు బాస్కర్, దండిగ రమేష్, ఊరటి అమరెందర్, కట్టస్వామి, రమేష్, బిక్షపతి, ఐలోని, రాజమౌళి ,ఆకారపు చందర్, వీరాస్వామి, సాంబయ్మ, కుమారస్వామి, కోటి, సుదీర్ రెడ్డి, పెరుమాండ్ల రవి మరియు ఆరు మండలాల ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :