Friday, 31 July 2026 02:38:30 PM

మెగా డీఎస్సీ ప్రకటించి 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి...

విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు

Date : 26 February 2024 09:02 PM Views : 436

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మెగా డిఎస్సి ప్రకటించి 25 వేల పోస్టులు భర్తీ చేయాలని అలాగే టేట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది నిరుద్యోగులు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. టీచర్ పోస్టులు భర్తీ చేయాలి పాఠశాలలో పటిష్టం చేయాలి అంటూ నినాదాలు ఇచ్చారు. డిఎస్సి లో 6000 కాదు- 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఈ ఆందోళనకు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య నిరుద్యోగుల ఉద్దేశాలు ప్రసంగిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెగా డీఎస్పీ ప్రకటించడం హర్షించ దగ్గ విషయం. కానీ టేట్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీచర్ పోస్టులు సంఖ్య విషయంలో అధికారులు ఆధారపడకుండా నిరుద్యోగుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిపి చర్చలు జరపాలని కోరారు. మెగా డిఎస్సి ప్రకటించక ముందే నిరుద్యోగ సంఘాలు, బి.సి సంఘాలు, ఉపాద్యాయ సంఘాలలో చర్చలు జరిపి ఖాళీలు నిర్ణయించాలని డిమాండ్ చేసారు.ఈ ముట్టడి కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జి. అనంతయ్య, పి.సుధాకర్, రాజేందర్, దీ సి.జి. ప్రీతం కుమార్, రేగుల మధు సుధాన్ రావు బాలరాజు, తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :