ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ట్రాన్స్ ఫార్మర్ మీద నుండి పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శారద నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న వివేక్ ఆసుపత్రిలోని ట్రాన్స్ ఫార్మర్ పై రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ప్రమాదవశత్తు విద్యుత్ తగిలి కింద పడిపోయినట్లు సమాచారం. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు.
Admin
Aakanksha News