Friday, 31 July 2026 01:13:48 PM

రామగుండం మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ ఉన్నట్ల లేనట్లా...?

గోదావరిఖని సిమ్స్ మెడికల్ కళాశాలలో జడలు విప్పిన ర్యాగింగ్ భూతం...మద్దెల దినేష్

Date : 14 February 2024 04:44 PM Views : 659

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మెడికల్ కళాశాలకు అసలు ప్రిన్సిపల్ ఉన్నట్టా.. లేనట్లా అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఇన్స్ ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్) మెడికల్ కళశాలలో చదువుతున్న జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వికృత చేష్టలతో నాన రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అసలు మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యర్ధుల బాగోగుల గురించి, వాళ్ళ సమస్యలు గురించి ప్రిన్సిపాల్ ఏ రోజు అయిన తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ కి నిరంతరం ఏ ఉద్యోగాలు ఎలా అమ్ముకోవాలి,తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఉద్యోగులను ఎలా తొలగించాలి, మెడిసిన్స్ ద్వారా ఎంత కమిషన్ తీసుకోవాలి, ఉద్యోగాల టెండర్లు ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి సొంత ప్రయోజనాల కోసం పాటు పడటం తప్ప మెడికల్ కళాశాల నిర్వహణను ఏవిధంగా చక్కదిద్దాలో ఆలోచన ఉండదని నిరంతరం ఆర్థిక వనరులు ఏ విధంగా వస్తాయో ఆలోచన తప్ప మరొకటి కాదని మద్దెల దినేష్ విమర్శించారు. కోటి ఆశలతో విద్యాలయాల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్న ర్యాగింగ్‌ను అరికట్టాల్సిందేనని, ఇందుకు కేంద్ర స్థాయిలో సమగ్ర ర్యాగింగ్ వ్యతిరేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరముందని రాఘవన్ కమిటీ గతంలో సిఫార్సు చేసిందన్నారు. ర్యాగింగ్ సంబంధిత నేరాలను భారత శిక్షాస్మృతిలో చేర్చాలని సూచించిందన్నారు. ర్యాగింగ్‌ను బెయిల్‌కు అనర్హమైన నేరంగా పరిగణించాలన్నారు. కఠిన చర్యలుఉంటేనే సీనియర్ల ముసుగులో చెలరేగిపోతున్న వికృత నేరగాళ్లకు కళ్లెం వేసే అవకాశం ఉంటుందన్నారు. ఆయా మాధ్యమాలు, సినిమాల్లో ర్యాగింగ్ చేయడాన్ని చూపడం మానాల్సి ఉందని, సినిమాల ప్రభావం యువతపై అధికంగా ఉండటంతో చాలా మంది వాటిని అనుకరిస్తూ పెడదారి పడుతున్నారని ఆరోపించారు. ర్యాగింగ్ విషయంలో నేరుగా విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నంబర్ కలశాల అవరణలో ప్రచారంలో ఉంచాలని, ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 2011 ర్యాగింగ్ నేరమని స్పష్టం చేస్తోందని, 53 చట్టంలోను సెక్షను 4 ప్రకారం ర్యాగింగ్ చేయాలనే ఉద్దేశ్యంతో కానీ లేదా ర్యాగింగ్ పాల్పడితే శిక్షార్హులని,దీంతో పాటు (ఐపీసీ) 294, 232,339,340,506 సెక్షన్ల ప్రకారం శిక్షార్హులని పేర్కొన్నారు. ర్యాగింగ్ పెనుభూతాన్ని అరికట్టాలన్నారు. దీనిపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన పెను ప్రమాదం అని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ ర్యాగింగ్ ల పేరుతో నాశనం చేసుకోవద్దని సూచించారు. సిమ్స్ లో జరిగిన ర్యాగింగ్ కు ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని వారిని వెంటనే బదిలి చేయాలని మద్దెల దినేష్ ప్రకటనలో డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :