Thursday, 30 July 2026 04:22:30 PM

ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

Date : 14 December 2024 06:10 PM Views : 1224

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్, టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా సీసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కార్నర్ వద్ద, మంచిర్యాల నుండి చెన్నూర్ వైపుగా ఆటో (TS15TV 2214 ) ద్వారా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల్ కు చెందిన వానరాసి అశోక్ ను అదుపులోకి తీసుకుని, ఆటోలో తరలిస్తున్న సుమారు 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :