ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, ప్రస్తుత ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందని (supma) శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్, కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిల గురించి ఎన్ని సార్లు మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నాలు చేసినా సమయం ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కనీసం విద్యా వ్యవస్థ సమస్యలను కూడా వినే ప్రయత్నం చేయడం లేదని వారు విమర్శించారు. డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం మేరకు దసరా సెలవులలోపు ఫీజుబకాయలు చెల్లించకపోయిన, ఫీజు నెంబర్స్మెంట్ పై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దసరా సెలవులు పూర్తి అయిన కళాశాలలను తెరవకూడదని నిర్ణయించుకున్నామని ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు కూడా తెలియజేస్తామని ప్రైవేట్ డిగ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
Aakanksha News