Saturday, 13 June 2026 02:40:29 PM

ప్రారంబానికి సిద్దమైన ఎకో పార్క్...

Date : 05 December 2024 08:51 PM Views : 516

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ సగర శివారులో నిర్మిస్తున్న కొత్వాల్ూడ ఎకో పార్క్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. డిసెంబరు 9న ఈ ఎకో పారు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమాసంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏకో పార్ట్యును నిర్మిస్తున్నారు. ఈ పార్కులో తొలిదశ పనులు పూర్తయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో ఎకో పార్కులో పక్షుల గ్యాలరీ, ఎలివేటెడ్ వాక్వి, వివిధ రకాల పూల మొక్కలతో ఉన్న పార్క్, బటర్పై పార్క్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గార్డెన్ అందుబాటులోకి రానున్నాయి. సెకండ్ ఫేజ్ కింద థీమ్ పార్యులు, అక్వేరియం, ఇతర ప్రకృతి అందాలను పర్యాటకులకు మధురానుభూతిని పంచనున్నాయి. ఈ పార్క్ లో 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలివేటెడ్ వాక్ ఏరియా ఉంది. సముద్ర జీవులతో అక్వేరియం ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ రిసార్టు, మినీ కన్వెన్షన్ సెంటర్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రకృతి రమణీమైన ల్యాండ్ స్కేపింగ్ ఇక్కడ స్పెషల్ అని చెప్పాలి. వివిధ రకాల ఆటలు, సాహసాలతో అడ్వెంచర్ జోన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎకో పార్కు 2022 అక్టోబర్ 12న నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన్ చేశారు. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నామని, ఇది నగర ప్రజలకు అహ్లాదాన్ని పంచుతుందని కేటీఆర్ ఇప్పల్లో వెల్లడించారు. నీటిలో నడిచే అనుభూతి ఉండేలా హిమాయత్ సాగర్పై ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్వాలూడ వద్ద 85 ఎకరాల్లో రూ.75 కోట్లతో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ బడ్జెట్ రూ.300 కోట్లకు పెరిగింది. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగురోడ్డును ఆసుకొని దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డు వాకితో పాటు దేశంలోనే అతి పెద్ద అక్వేరియం. ఏవీయర్ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :