Thursday, 30 July 2026 12:27:43 PM

వారు చేసిన తప్పులకు రెండు, మూడేళ్లు కాదు .. పదేళ్ల జైలు శిక్ష కూడా తక్కువే..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Date : 26 October 2024 07:33 PM Views : 344

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వారు చేసిన తప్పులకు కేసీఆర్, కేటీఆర్‌లను రెండు, మూడేళ్లుకాదని.. పదేళ్ల జైలు శిక్ష కూడా తక్కువేనని అన్నారు. కాళేశ్వరం మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. అంత వ్యయం పెట్టి కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చాలా తక్కువధరకే విద్యుత్ దొరుకుతుందని స్పష్టం చేశారు.విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన లేదని అన్నారు. కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక వెసులుబాటు తమకు లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉంది, కానీ పదేళ్లలో రూ.8లక్షల కోట్లు కేసీఆర్ తెలంగాణపై అప్పు చేశారని విమర్శించారు. ఏ పథకాన్ని ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో విడుతాల వారిగా చేసిన దానికంటే తాము రుణమాఫీ చేసిన మొత్తం ఎక్కువేనని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం, పథకాలను ఎగ్గొట్టాలనే ఆలోచన లేదని చెప్పారు. హైడ్రాలో ఒక్కటే పేదల ఇల్లు కూలిందని చెప్పారు.‘‘సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ పట్టుకుందమంటే పట్టుకునే వీలు లేకుండా విదేశాల్లో ఉంటూ నడుపుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో యథేచ్ఛగా చెరువుల కబ్జా జరిగింది. వయనాడులో జరిగిన విధ్వంసం తెలంగాణలో జరగకూడదనే యుద్ధప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేపట్టాం. విడతల వారిగానే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం.హైడ్రాతో పేదవారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం. హైడ్రా, మూసీపై రివ్యూ చేస్తున్నాం. పేద, మధ్యతరగతి వారికి అన్యాయం కలగకుండా చర్యలు ఉంటాయి. అనుమతులు ఉన్నవాటిని వదిలేయాలి.మూసీలో మాత్రం స్వచ్ఛందంగానే కొందరు ముందుకు వచ్చారు. వారికి ఉపాధి కల్పన, మిగతా అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీవో నెంబర్ 29పై ఎవరికి నష్టం జరుగదని అధికారులు చెప్పారు. మెరిట్ లిస్ట్‌లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. జీవో నెంబర్ 29పై ఎవరు ఆందోళన చేశారో, ఎందుకు చేశారో తెలియడం లేదు.9 నెలలు అవుతుంది, ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయాడు. ప్రజల సమస్యలపై కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు. కేసీఆర్‌కు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన చేస్తున్నది ఏంటి. సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లును కూల్చామనే చెప్పారు, కానీ కోర్టు డైరెక్షన్ వల్లే కూల్చలేదు. ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు, అదాని ఇచ్చారు అంతే. ప్రతిపక్షాల రాద్దాంతంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు, అంతే తప్ప భవిష్యత్ తరాలకోసమే , మూసీ ప్రక్షాళన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం ఉండదు. ఫిరాయింపులపై కోర్టుదే తుది నిర్ణయం. చేరికల విషయంలో జీవన్ రెడ్డికి వివరించిన తర్వాతే చేర్చుకున్నాం. జీవన్ రెడ్డికి మేము, పార్టీ అండగా ఉంటుంది.పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు స్థానికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు, వాటిని సర్దుబాటు చేసుకోని ముందుకు వెళ్తాం. బీఅర్ఎస్‌లో ఏముందని చేరతారు.కేసీఆర్ కనబడటం లేదు, ఎవరిని చూసి బీఆర్ఎస్‌లో చేరతారు. ఏ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం లేదు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు ఇలా అన్ని కేసుల విచారణ ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యవహారం. కేంద్రాచట్టలు వర్తిస్తాయి. పార్టీ మెన్ అనే నాకు అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా గాంధీ భవన్ ఉంటుంది. కేసీఆర్ చేసినట్లు మేము మోసం చేయమనే క్లారిటీతో ప్రజలున్నారు. 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలుచేస్తాం. డబ్బుల వెసులుబాటు లేకపోవడంతోనే కొంత ఆలస్యం జరుగుతుంది. పట్టురానిదే పథకాలు అమలు చేస్తున్నమా. మంత్రులకు స్వేచ్ఛ ఉంది’’ అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.‘‘చేరికలు ఆగలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గలేదు. గతంలో ఉన్నట్లే ఇప్పుడు ఉంది. కొత్త పాత కలయికతో పార్టీలో కొత్త ఇబ్బందులు వచ్చాయి, వాటిని సర్దుబాటు చేస్తున్నాం. పార్టీలో ఉన్న నేతలను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి. కేటీఆర్‌తో సన్నిహితంగా ఇన్ అండ్ ఔట్ ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ అధిష్ఠానం, సీఎం చేతుల్లో ఉంది. టెక్నీకల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే చేరినట్లు అధికారికంగా ప్రకటించడం లేదు. పొంగులేటి పొలిటికల్ బాంబ్‌లపై నేను ఎదురుచూస్తున్నా. కొండాసురేఖ వ్యక్తుల పేర్లు తీసుకోని మాట్లాడి ఉండకూడదు, సబబు కాదు. ఎప్పటిదో పాత ఆడియా క్లిప్ లీక్ చేశారు. ఆమెను ట్రోల్ చేసిన బాధలో, ఆక్రోశంలో ఆమె అలా మాట్లాడారు’’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :