Thursday, 30 July 2026 02:38:48 PM

పురుగు మందు సేవించి యువకుడు మృతి

Date : 16 October 2022 08:50 PM Views : 407

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పురుగుమందు సేవించి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామస్తుల కథనం ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన మల్కం కిరణ్ (21) అమ్మమ్మ దగ్గర జీవనం సాగిస్తూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే చిన్న వయసులోనే తండ్రి మృతి చెందడంతో తల్లి మరో వివాహం చేసుకోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటూ కులీ పని చేస్తున్నాడు.ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారిన కిరణ్ పురుగుమందు సేవించి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండడానికి గమనించి వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :