ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : జాతిపిత మహాత్మా గాంధీని అసురునితో పోల్చుతూ పశ్చిమ బెంగాల్లో వేదికను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిలభారత హిందూ మహాసభ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు రాజాలు మాట్లాడుతూ... జాతిపిత మహాత్మా గాంధీపై ఇలాంటి అనుచిత చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. అఖిలభారత హిందూ మహాసభ వెనుక బిజెపి ఆర్ఎస్ఎస్ ఉండి ఇలాంటి కుట్రలకు తెరరేపుతున్నారని అన్నారు. బిజెపి పార్టీకి ఆర్య వైశ్యులు బుద్ధి చెబుతారని అన్నారు. బిజెపి పార్టీ మోడీ ప్రభుత్వం మహానుభావుల చరిత్రలను మరుగున పడేయాలని కుట్రలు చేస్తుందని అన్నారు. బిజెపి, మోడీ ప్రభుత్వాలు కార్పోరేట్లకు కొమ్ము కాస్తూ సామాన్య వ్యాపారస్తులను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, వాసవి భవన్ అధ్యక్షుడు తోట శ్యాంప్రసాద్, ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు గుండా శ్రీదేవి మురళి, ఆర్య వైశ్య సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు మీలా వంశీ, పట్టణ మహిళా అధ్యక్షురాలు కలకోట అనిత లక్ష్మయ్య, దేవరశెట్టి సత్యనారాయణ, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ మెంబర్ వెంపటి సురేష్, కృష్ణ, యామా సంతోష్, గుమ్మడవల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News