ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : భారతదేశ అభివృద్ధి చెందాలంటే సనాతన ధర్మం కాపాడబడాలని, అది బ్రాహ్మణుల వల్లే సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ లోని నల్లచెరువు ఎదురుగా ఉన్న త్రిశక్తి దేవాలయంలో జరిగిన "విప్ర వాగ్దేవి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా "కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశం అంటేనే హిందూ దేశం అని, హిందుత్వాన్ని నాశనం చేయడానికి దేశంలో చొరబడిన అనేక విదేశీయ శక్తులు ఆహోరాత్రులు పనిచేస్తున్నాయని, వారి పన్నాగాలను పటాపంచలు చేసి ధర్మాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం బ్రాహ్మణులు జాగ్రత్తమై హిందువులను ఐకమత్యం చేసినప్పుడే అది సాధ్యమని ఆమె అన్నారు. హిందువుల ఐక్యతకు నిదర్శనం అన్నారు. అలాగే మున్ముందు హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చి మద్యపానం గెలిపిస్తే సనాతన ధర్మం కాపాడబడుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే హిందువుల రక్షణకు, సనాతన ధర్మ రక్షణకు పాటుపడుతుందన్నారు. మన ధర్మాన్ని కాపాడే పార్టీకే మనం మద్దతు తెలపాలని సూచించారు. సనాతన ధర్మం బతికున్నన్నాళ్లే హిందువులు సుఖంగా ఉంటారని, సనాతన ధర్మానికి హాని కలిగితే హిందువుల మనుగడ కష్ట సాధ్యమని బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉభయ రాష్ట్రాల సంయుక్త కార్యదర్శి ఉజ్వల అన్నారు. సనాతన ధర్మం కాపాడబడాలంటే ముందుగా బ్రాహ్మణ జాతి ఉద్ధరింపబడాలని అన్నారు. బ్రాహ్మణులు ముందు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇతరులకు మార్గదర్శనం చేయడం జరుగుతుందన్నారు.సంస్కృతి సంక్షేమం సంక్షేమం కలబోసిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని బుల్లితెర నటి ఢిల్లీ రాజేశ్వరి అన్నారు. ప్రతి మగవాడి అభివృద్ధి వెనుక ఒక మహిళ ఉందనే విషయాన్ని పూర్ణ కాలం నుంచి చెప్పు వస్తున్నారని తెలిపారు. కొందరు మాత్రం అన్ని చేయగలరు, అందరూ కొన్ని చేయగలరు అని కాకుండా అందరూ అన్నీ చేయగలరని మహిళను నిరూపించాలన్నారు. బ్రాహ్మణ మహిళలు పదిమందికి ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పబ్లిషర్ భావరాజు పద్మిని మాట్లాడుతూ మహిళా శక్తి స్వరూపిణి అని, మహిళలలో అపరిమితమైన శక్తి ఉంటుందని దీనిని సమాజాభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. తెలంగాణ బ్రాహ్మణ మహిళా శక్తి వ్యవస్థాపక అధ్యక్షురాలు తాటికొండ అనురాధ మాట్లాడుతూ మనలో ఉన్న మనస్తత్వం మారాలని, అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరారు. వ్యాపార రంగంలో మహిళలు ముందుకు వస్తే వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫౌండర్ భువనేశ్వరి అధ్యక్షుని అధ్యక్ష ఉపన్యాసం ఇస్తూ బ్రాహ్మణులు వివాహ వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిపై ఇంటర్వ్యూలు కోరగా 200 పై చిలుకు ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గాయని కళ్యాణి, బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షురాలు పావని శర్మ, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కులకర్ణి, ప్రధాన కార్యదర్శి శ్రీదేవి రవీందర్, సంయుక్త కార్యదర్శి ఉజ్వల, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కొన్ని పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి గా రమాదేవికి గ్రామ బంగారం, ద్వితీయ బహుమతిగా ప్రసన్నకు వెండి కుంకుమ భరణి, తృతీయ బహుమతిగా హైదరాబాద్ నగరానికి చెందిన భ్రమరాంబ కు పట్టుచీర బహుకరించారు. శ్రీ నారాయణ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నేరెళ్ల మల్లి కార్జునరావు వేసిన లక్కీ డ్రాలో ఈ మూడు బహుమతులు అందజేశారు. సంక్షేమ వేదిక రాష్ట్రాల ఉపాధ్యక్షులు వెంకట కిషన్ రావు, కార్యదర్శి బాల శ్రీనివాసులు ఈ కార్యక్రమ నిర్వహణకు సమన్వయం చేసి తోడ్పడ్డారు. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లికార్జున రావు, ఫణింద్ర, శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News