Thursday, 30 July 2026 01:15:51 PM

పెద్దపల్లి జిల్లాలో దారుణం... మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..

Date : 17 August 2023 07:46 AM Views : 2240

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక పై నలుగురు వ్యక్తులు 3 రోజుల క్రితం రాత్రి పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో అఘాయిత్యానికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడిన బాలికను ఓ ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. దీంతో మధ్యప్రదేశ్ లోని బాల్కోట్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక అక్క, బావలతో సహా భవన నిర్మాణంలో పనిచేసేందుకు వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వెంచర్ లో పనిచేస్తున్న పెద్దపల్లి చెందిన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితుల్లో ఇద్దరు పెద్దపల్లికి చెందిన వారుకాగా మరో ఇద్దరు వరంగల్, భూపాలపల్లి కి చెందిన వారిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :