ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నాయకులు మోసం చేస్తే.. ప్రజలు నన్ను ఆదరించారని పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి అన్నారు.ఈ మేరకు వినాయక చవితి నవత్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం గోదావరిఖని హనుమాన్ నగర్ 41వ డివిజన్ లోని భారత్ యుత్ తో పాటు పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారని అన్నారు. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గం నుండి ఆడబిడ్డగా ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నానని తనను ఆదరించి వారి సహాయ సహకారాలను అందించాలని కోరారు. నా రాజకీయ ప్రస్థానంలో ప్రజల సమస్యలపైనే పోరాటాలు నిర్వహించానని ముందు ముందు కూడా ఇలాగే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తానని పిలుపునిచ్చారు.అనంతరం సంధ్యారాణిని పెద్ద ఎత్తున మహిళలు పూలమాల శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోలేటి సుమలత, నూనేటి భాగ్యలక్ష్మి నూనెటి విజయ, మారుపాక రమాదేవి, అలేఖ్య, దుప్పటి కవిత, దుర్గం శృతి, మంద శ్యామలత, మిట్టపల్లి లావణ్య, గుండ్రోజు ఉమా, రజిత, గుండారపు లక్ష్మి, తో పాటు కమిటీ సభ్యులు కొట్టే మదునయ్య, మారుపాక శ్యామ్, నునేటి దేవేందర్, మిట్టపల్లి వెంకటేష్, కోలేటి సతీష్, మారుపాక శ్రావణ్ కుమార్, మంద బిక్షపతి, దుర్గం గోపి, యశ్వంత్, గుండారపు రవి తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News