Thursday, 30 July 2026 12:30:53 PM

జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి...

మాదిగ జాగృతి సంఘం డిమాండ్...

Date : 10 December 2024 06:15 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఆయా రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా... 15% SC రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం- డిమాండ్ చేసింది ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సి వర్గీకరణ ఏకసభ్య కమీషన్ కమీషన్ చైర్మన్ శమీమ్ అక్తర్ ను మాదిగ జాగృతి సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా (MJS) కన్వీనర్ భూపతి గల్ల సుధాకర్ మాట్లాడుతూ అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల SC జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభా కు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలి. 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్లను కేటాయించాలని కోరినట్లు తిలిపారు..తద్వారా.. ఇప్పటివరకూ ఈ రిజర్వేషన్ల ఫలాలను తగు రీతిలో అనుభవించని కులాలకు & జనాభా ప్రాతిపదికన పైన సూచించిన విధంగా వర్గీకరించి రిజర్వేషన్లు కేటాయించడం ద్వారా భారత రాజ్యాంగ మూల సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఏంజెస్ నాయకులు చింతపట్ల భాస్కర్ , గజ్జల భాస్కర్, సురేందర్, అనుక్ లో తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :