Saturday, 13 June 2026 02:27:47 PM

అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్‌..

సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశాలు

Date : 13 December 2024 06:18 PM Views : 596

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సంధ్య ధియేటర్ లో జరిగిన తొక్కిసిలాటలో మృతి చెందిన రేవతి కేసులో ఉదయం చిక్కడిపల్లి పోలీసులు సినీనటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేరిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ ను అల్లు అర్జున్ కు కోర్టు విధించింది. దీంతో అల్లు అర్జున్‌ తరుపున తమ న్యాయవాదులు మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేయగా పోలీసులు, ప్రభుత్వ తరుపున లాయర్లు బెయిల్ ఇవ్వద్దని వాదించారు. దీంతో హైకోర్టు అల్లు అర్జున్‌ క్వాష్ పిటిషన్‌ ను విచారించి సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసారు. అయితే రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు. అయితే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఉదయం నుండి ఉత్కంటంగా సాగిన ఈ కేసులో చివరకు అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :