Thursday, 30 July 2026 09:01:46 PM

అంబేద్కర్ పుట్టి ఉండకపోతే నిమ్న తరగతులకు రాజ్యాంగ హక్కులు లభించేవి కావు...

మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు

Date : 14 April 2025 05:08 PM Views : 634

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : బాబాసాహెబ్ పుట్టి ఉండకపోతే వంచిత, బలహీన, నిమ్న తరగతులకు, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు రాజ్యాంగ హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ లభించేవి కావని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఆయన లేకపోతే ఈ దేశ ప్రజాస్వామ్య రూపం భిన్నంగా ఉండేది. ఆయన మాత్రమే వీరి నిజమైన రక్షకుడన్నారు. 134వ బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ట్యాంక్‌బండ్ విగ్రహానికి తెళ్ళవారు జమున ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “అంబేద్కర్ చూపిన మార్గం – మానవ సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ బాధ్యత – ఇవే దేశ భవిష్యత్తు మూలస్తంభాలు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలు ఒకటిగా మారాయి. ఇది బాబాసాహెబ్ చూపిన మార్గాన్ని అనుసరించడమే,” అని ఆయన స్పష్టం చేశారు.దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని, ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్థరాత్రి ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రజలు భారీ స్థాయిలో హాజరై, జయంతిని ప్రజా ఉత్సవంగా మార్చారు.అనేకమంది అభిమానులు, సామాజిక కార్యకర్తలు, యువ నాయకులు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ సేవలను స్మరించుతూ, నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగాయి.ఈ కార్యక్రమంలో సకల జనుల సేవా సంఘం అధ్యక్షుడు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చుతూ వేడుకలను జరిపారు. బాబాసాహెబ్ మహానుభావుని సేవలను చాటిచెప్పే నినాదాలతో ఆ ప్రాంతమంతా ఉత్సాహంగా మారిపోయింది.విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపులో బాబాసాహెబ్ రచనలపై చర్చలు, యువతతో బహిరంగ సంభాషణలు నిర్వహించబడ్డాయి. అంబేద్కర్ ఆశయాల అమలే ఈ దేశానికి గణనీయమైన మార్గదర్శకం అన్న సంకల్పంతో సభ ముగిసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :