Saturday, 01 August 2026 03:22:51 AM

మాజీ సీఎం రోశయ్య సతీమణి శివలక్ష్మీ కన్నుమూత...

Date : 12 January 2026 11:16 AM Views : 349

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్ జిల్లా అమీర్‌పేటలోని స్వగృహంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ (86) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె కుటుంబ సభ్యుల మధ్యే కన్నుమూశారు. శివలక్ష్మీ మరణంతో వారి కుటుంబంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సామాజికంగా సాదాసీదా జీవితం గడిపిన శివలక్ష్మీ, రోశయ్య ప్రజాజీవితంలో ఉన్న కాలంలో ఆయనకు అండగా నిలిచారని సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. శివలక్ష్మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నివాళులర్పించారు.శివలక్ష్మీ అంత్యక్రియల వివరాలను కుటుంబ సభ్యులు తర్వాత వెల్లడించనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :